పదవ తరగతి విద్యార్థులను పరీక్షా కేంద్రం వద్ద దింపి వస్తున్న స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనకు శనివారం చోటు చేసుకుంది. ఒకటవ టౌన్ ఎస్ఐ సుమలత తెలిపిన వివరాల ప్రకారం..
స్థానిక ఏస్ఆర్ పాఠశాలకు చెందిన బస్సు శనివారం ఉదయం పదవ తరగతి విద్యార్థులను పరీక్షల నిమిత్తం హరిచరణ్ మార్వాడీ పాఠశాల వద్దకు తీసుకువచ్చిందనీ తెలిపారు. విద్యార్థులందరినీ పరీక్షా కేంద్రం వద్ద దించేసిన అనంతరం, డ్రైవర్ బస్సును రివర్స్ తీస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టారన్నారు. ఈ ధాటికి స్కూల్ బస్సు స్వల్పంగా దెబ్బతినగా, డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
అయితే, ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ఒకటవ టౌన్ పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమలత వెల్లడించారు.
