Monday, May 20, 2024
HomeCRIMEజీవన్ మాల్ యాజమాన్యానికి నోటీసులు -గడువులోగా బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేస్తామని ప్రకటించిన టిఎస్ ఆర్టిసి...

జీవన్ మాల్ యాజమాన్యానికి నోటీసులు -గడువులోగా బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేస్తామని ప్రకటించిన టిఎస్ ఆర్టిసి అధికారులు

జీవన్ మాల్ యాజమాన్యానికి నోటీసులు -గడువులోగా బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేస్తామని ప్రకటించిన టిఎస్ ఆర్టిసి అధికారులు

-గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటి నోటీసులు అందజేసిన అధికారులు, – నేడు సాయంత్రం లోగా 3.14 కోట్ల రూపాయలు చెల్లించాలని చివరి గడువు విధించిన అధికారులు – బకాయలు చెల్లించకపోతే స్వాధీనం పరుచుకుంటాము.- జీవన్ మాల్ లో పోలీసు బందోబస్తు మధ్య దుకాణ దారులకు మైక్ ద్వారా ప్రకటించిన అధికారులు

జాన రమేష్ :ఇది సంగతి :ఆర్మూర్:

గత ఎన్నికలకు ముందు ఆర్మూర్ పట్టణంలోని జీవన్ మాల్ కు బకాయిలు చెల్లించవలసిందిగా నోటీసులు అందజేసిన అధికారులు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు జీవన్ మాల్ ను స్వాధీన పరుచుకుంటామని ప్రకటించడం ఆర్మూర్ పట్టణంలో కలకలం రేపుతుంది.

ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ మాల్ యాజమాన్యం చెల్లించవలసిన మూడు కోట్ల 14 లక్షల రూపాయల బకాయిలను నేడు సాయంత్రం లోగా చెల్లించకపోతే స్వాధీనపరచుకుంటామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

గడువులోగా నోటీసులు అందించినప్పటికిని బకాయిలు చెల్లించినందున హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ అధికారులు ఆర్మూర్ పట్టణంలోని జీవన్ మాల్ లో ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ మాల్ విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ యజమాన్యానికిఆర్టీసీ అధికారులు నోటీసులను అందజేశారు. అంతేకాకుండా విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

అనంతరం నెల రోజుల్లో బకాయిలు చెల్లించాలని యాజమాన్యానికి అధికారులు నోటీసులు అందించినప్పటికిని స్పందించకపోవడంతో జీవన్ మాల్ ను స్వాధీన పరచుకుంటామని చివరి నోటీసు అందజేశారు .

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సెక్యూరిటీ విజిలెన్స్ కరీంనగర్ అధికారి బాబురావు, ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ శంకర్, ఆర్మూర్ డిపో మేనేజర్ ఆంజనేయులు తో పాటు స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments