రైతు సమస్యలపై కేంద్రంతో కొట్లాడుతా…రైతుల సమస్యలపై కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకువస్తా నని వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ వాటి అనుబంధం పాటు చేస్తామని చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి కల్పన కల్పిస్తామని గంటా చరిత రావు అన్నారు.
గురువారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో నిజామాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి గంటా చరితారావు మాట్లాడారు. వరి జొన్న మిర్చి చెరుకు పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని ఆమె తెలిపారు. యువతకు ఉపాధి లేక యువత గల్ఫ్ కు వెళ్తున్నారని ఆమె వాపోయారు.
యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ఐటీ హబ్స్ ఇండస్ట్రీస్ నెలకొల్పి యువత ఉద్యోగాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మహిళా సాధికారతను పెంపొందించి విధంగా వృత్తి విద్యాసంస్థల స్థాపిస్తామని ఆమె అన్నారు. యూజీపిజి చదివే విద్యార్థినులకు సరైన వసతి గృహాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
విద్యార్థులు ఇబ్బందులు కలగకుండా నూతన వసతి గృహాల నిర్మాణం చేపడతా మనీ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువత ప్రాణ త్యాగాలు చేశారని అలాంటి ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోలేక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ మా వీరుల కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు కార్డు అందించడమే మా లక్ష్యం అంటూ ఆమె హామీ చేశారు.మహిళల పట్ల ఇంకా అత్యాచారం జరుగుతున్నాయని దానిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఆమె తెలిపారు.కుల మతాలాకు అతీతంగా రాజకీయాలు చేతున్నారు.
కాబట్టి ఇది ప్రజలు గ్రహించి ఓటు వేయాలని ఆమె కోరారు.భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు. అభివృద్ధి చెందిన దేశం అని మనం గర్వంగా చెప్పుకునే రోజు తొందరలో రావాలని. ఆమె పేర్కొన్నారు.
రాజకీయ అనుభవిజ్ఞులైన రాజకీయ నాయకులతో సమానంగా యువత కూడా ముందుకు వచ్చి పోటీ చేయాలని ఆమె పేర్కొన్నారు. దేశంలోని అన్ని నియోజకవర్గాలలో సమస్యలను నిర్మూలించాలన్న. నిరుద్యోగం అంత పొందించాలన్న యువత తప్పనిసరిగా ముందుకు రావాలని ఆమె పేర్కొన్నారు.