కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు భావోద్వేగా ప్రసంగాలు చేస్తూ ప్రజల మనసును డైవర్ట్ చేస్తున్న రని మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని బిఆర్ యస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. అసలు ఏడ్చే మొగాణ్ణి నమ్మొద్దన్నారు.
తనకు ఎమ్మెల్సీ మాత్రమే ఉంది.. మిగతా పదవులు లేవు.. నా వయసు అయిపోయింది.. ఇలా ముసలి కన్నీరు కాలుస్తూ, భావోద్వేగాల ప్రసంగాలు బ్లాక్మెయిల్ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.రైతన్నలు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడం బాధాకరం అంతే కాకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు
ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేసుకోవడం సివిల్ సప్లై అధికారులకు సరైనటువంటి ఆదేశాలు జారీ చేయకపోవడం దౌర్భాగ్యం.. పరిపాలన అస్తవ్యస్తంగా కొనసాగుతుంది వ్యవస్థ ఈరోజు ఒక్క జగిత్యాల లోనే కాదు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక 50 శాతం ధాన్యం రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు..
మిగతా 50 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురైతున్నాయి…ప్రభుత్వం ఈరోజు ఐకెపి ద్వారానో లేకపోతే సొసైటీ ద్వారా రైతులు ధాన్యం రోడ్లమీద కల్లాలలో రాళ్ల వర్షాలకు తడుస్తూ రైతులు తీవ్ర నష్టం కలుగుతుంది అంతేకాకుండా హమాలి వడ్లు జోకిన తర్వాత.. లేటుగా లోడింగ్ చేయడం వల్ల.. ధాన్యం వెయిట్ లాస్ అవడం జరుగుతుంది, అంతేకాకుండా, రైస్ మిల్లర్లు వారు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.
ఏవైతే ఎన్నికల హామీల్లో ఇస్తానన్న క్వింటాలుకు 500 బోనస్ ఎక్కడ.. ఇప్పటికీ రైతులకు ఇవ్వకపోవడం సిగ్గుచేటు..పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీగా ఉండి ప్రభుత్వంలో ఉండి.. రైతులను ఆదుకోకపోవడం.. రైతుల గురించి, మాట్లాడకపోవడం దౌర్భాగ్యం అని వాక్యాన్ని ఇచ్చారు.
మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నుంచి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికై ఉద్యోగస్తుల సాధకబాధకుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడిన దాఖలు లేవు.
ఏడిచే మగవని నమదు.. ఇలాంటి వ్యక్తులను
ప్రజలు గమనించి తప్పకుండా మీలాంటి వాళ్లకు రానున్న ఎంపీ ఎలక్షన్లో కారు కల్చి వాత పెట్టనున్నారు అని ఆయన పేర్కొన్నారు.
నీకు మాత్రం ఎమ్మెల్సీగా పోటీ చేస్తావు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు.. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తావ్… మీ కుటుంబంలో అందరూ జడ్పిటిసిలు ఎంపీపీలు, చైర్మన్లు ఉండాలా… మిగతా వారేమో ఉండకూడదు… అనే ధోరణి జీవన్ రెడ్డి గారిది..
ప్రజలు గమనించి తప్పకుండా మీలాంటి వాళ్లకు రానున్న ఎంపీ ఎలక్షన్లో కారు కల్చి వాత పెట్టాలన్నారు అని ఆయన పేర్కొన్నారు.