లోకసభ ఎన్నికల ప్రచారం కోసం బుధవారం నిజామాబాద్ నగరంకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భద్రత వైఫల్యాలు వెక్కిరించాయి.
పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లోపం ఎక్కడ జరిగిందో ఆయన అరా తీశారు. గురువారం ఆయన తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ నిజామాబాద్. పర్యటించారు. సీఎం అయ్యాక ఆయన జిల్లాకు రావడం ఇది రెండో సారి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సభ లో పాల్గొనడానికి జిల్లా కేంద్రానికి వచ్చారు.
నిజనికి ఆ సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. జిల్లా నేతలకు గట్టిగా క్లాస్ ఇచ్చారు. దీనితో రెండో సారి ఎన్నికల ప్రచారం కోసం రావడంతో సహజంగా కాంగ్రెస్ నేతలు సుదర్శన్ రెడ్డి భూపతి రెడ్డి భారీఎత్తున ప్రజలను జిల్లా కేంద్రానికి తరలించారు. వలస నేతల్లో ను ఉత్సహం కొట్టచ్చి నట్లు కనిపించింది.
ఆర్మూర్ నుంచి బై రోడ్ నిజామాబాద్ నగరానికి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చిన సీఎం గోల్ హనుమాన్ చౌరస్తా నుంచి రోడ్ చేపట్టారు. కానీ ఆయన కాన్వాయి నగరంలో ఆయా ప్రాంతాల మీదుగా సాగింది. కాన్వాయ్ లోకి ఇతర వాహనాలు రాకుండా ముందే కట్టడి వ్యూహం రూపొందించారు.
కానీ అనేక ప్రాంతాల్లో కాన్వాయ్ లోక్ ఇతర వాహనాలు చొచ్చుకొని రావడం తో పాటు నెహ్రు పార్క్ లోను కార్నర్ మీటింగ్ వద్ద కూడా తోపులాట జరిగింది.
రోప్ పార్టీ పటిష్టంగా పనిచేయలేక పోయింది. దీనీతో సీఎం బందోబస్తు ను స్వయంగా పర్యవేక్షిస్తున్న కమిషనర్ సంబంధిత అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసారని సమాచారం