డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్‌కు నిజామాబాద్ జిల్లా డిసిసి చైర్మన్‌గా వర్ధన్ హాస్పిటల్ వైద్యులు, డాక్టర్ సృజిల్ బాబు తెడ్డు ను నియమించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ నాంపల్లిలో అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.
పార్టీని బలోపేతం చేయడానికి టిపిసిసి అధ్యక్షులు ,ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని నిలబెట్టడానికి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయడానికి మరింత దోహదపడేందుకు నిరంతరం కృషి చేయాలని తాను కోరుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ సృజిల్ బాబు తెడ్డు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్‌కు నిజామాబాద్ జిల్లా డిసిసి చైర్మన్‌గా నియమించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎమ్ఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, కాంగ్రెస్ పార్టీ నగర జర్నల్ సెక్రెటరీ ధర్మారం అవీన్, తెడ్డు బాబు తదితరులు పాల్గొన్నారు.
