మాక్లుర్ మండలం మదన్ పల్లి గ్రామంలో ఈరోజు మహిళా భవనం నిర్మాణానికి ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రాస లావణ్య, ఉప సర్పంచ్ రాస మహేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సర్పంచ్ రాస లావణ్య పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇటువంటి భవనాలు ఎంతో ఉపయోగకరమని, నాణ్యమైన పనులతో భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈ సాయి సూర్య, గ్రామ కార్యదర్శి రాజ్ కుమార్, వార్డు మెంబర్లు పోతన్న, అశోక్, మహిబూబ్, హుస్సేన్, లింగన్న, శ్రీనివాస్, పీర్ సింగ్ లతో పాటు గ్రామస్తులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
