ఈ రోజు మదన్‌పల్లి గ్రామంలో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ శ్రీమతి రాస లావణ్య మహేష్ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించబడింది.ఈ సమావేశంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలు మరియు అవసరాలపై చర్చించబడింది.
వాటిలో ప్రధానంగా:గ్రామంలోని మురికి నీటి కాలువల నిర్వహణసీసీ రోడ్ల నిర్మాణంపారిశుధ్య నిర్వహణమంచి నీటి సరఫరా మరియు నిర్వహణవీధి దీపాల ఏర్పాటు మరియు మరమ్మతులుఉపాధి హామీ పనులుగ్రామంలోని పాఠశాలల అభివృద్ధిఅంగన్వాడీ కేంద్రాల నిర్వహణఅలాగే ఇతర గ్రామాభివృద్ధి పనుల గురించి కూడా విస్తృతంగా చర్చించబడింది.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పద్మ గారు, గ్రామ కార్యదర్శి రాజ్‌కుమార్ గారు, ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసు శాఖ సిబ్బంది, వార్డ్ సభ్యులు అశోక్ పోతన్న మహిబూబ్ లలిత సురేష్ లక్ష్మి లింగన్న మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
