HomeCRIMEముళ్లపొదల్లో నవజాత శిశువు

ముళ్లపొదల్లో నవజాత శిశువు

మోపాల్‌ మండలంలో అమానవీయ ఘటన.. 108 సిబ్బంది ఆసుపత్రికి తరలింపుమోపాల్‌ మండలం మోపాల్‌ నుంచి శిర్పూర్‌ వెళ్లే రహదారి సమీపంలోని ముళ్లపొదల్లో ఒక్కరోజు వయసున్న ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసిన ఘటన చోటుచేసుకుంది.

అటుగా వెళ్తున్న స్థానికులు శిశువు ఏడుపును గమనించి పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నిజామాబాద్‌ 108 అంబులెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును ముళ్లపొదల్లో నుంచి బయటకు తీసి, ప్రథమ చికిత్స అనంతరం నిజామాబాద్‌ మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం శిశువు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లిన వ్యక్తులు ఎవరనే విషయంపై మోపాల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శిశువును ఎవరు అక్కడికి తీసుకొచ్చి వదిలారు? ఘటనకు ముందు అక్కడికి ఎవరు వచ్చారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ ఘటనలో నవ జాతి శిశువును 108 సిబ్బంది ఈఎంటీ చి. బనేష్‌, పైలట్‌ పి. అనిల్‌ సేవలందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments