HomeCRIMEస్నాచింగ్‌ 'మహా ' ముఠా పనేనా?......నగరంలో స్నాచింగ్ కు వచ్చింది రెండు ముఠాలు ?.......రైళ్లో వచ్చారు...

స్నాచింగ్‌ ‘మహా ‘ ముఠా పనేనా?……నగరంలో స్నాచింగ్ కు వచ్చింది రెండు ముఠాలు ?…….రైళ్లో వచ్చారు …..బైకు లు చోరీ చేసారు …

నగరంలో గురువారం ఉదయం జరిగిన వరుస చైన్ స్నాచింగ్. ఘటనల్లో విస్తు పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గంట వ్యవధి లో మూడు చోట్ల స్నాచింగ్ ముఠాలఉనికి తో ఉలిక్కి పడ్డ పోలీసులు ముఠాలను గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

కేవలం గంట వ్యవధిలో మూడు ఘటనలకు పాల్పడింది మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు మొదట మూడు చోట్ల ఓకే ముఠా అని భావించినప్పటికీ రెండు ముఠాలు వేరువేరుగా వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. రైల్ లో అర్ద రాత్రి నగరంలోకి వచ్చిన ముఠా మొదట బైకు లను చోరీ చేసారు.

అవే బైక్ లమీద చైన్ స్నాచింగ్ లకు పాల్పడివుంటారని పోలీసులు ప్రాథమిక అంచనాగా చెప్తున్నారు . సాధారణంగా ఇలాంటి ముఠాలు తమ వెంట వాహనాలను తీసుకురావు. రైలు దిగగానే స్థానికంగా ఏదో ఒక ప్రాంతంలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తారు. గురువారం కూడా అదే జరిగింది.

3వ టౌన్, 4వ టౌన్ పరిధిలో రెండు బైకులను దొంగిలించి, వాటిపైనే స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఇలా చేయడం వల్ల పోలీసులు సిసి కెమెరాల ద్వారా వాహన నంబర్లను గుర్తించినా, అవి దొంగిలించినవి కావడంతో దొంగలు సులభంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది.కాబట్టి చోరీ చేసిన వాహనాలతో రెండు గ్యాంగ్ చోరీలకు పాల్పడ్డారు.

వీరు పక్కాగా ప్లాన్ చేసినా, మహిళల ధైర్యం ముందు వారి పప్పులు పూర్తిగా ఉడకలేదు. గాయత్రీ నగర్‌లో మహిళ గట్టిగా కేకలు వేయడంతో ముఠా సభ్యులు తోకముడిచారు.అక్కడ నుంచి శ్రీనగర్ కాలనీ వెళ్లి మూడున్నర తులాల గొలుసును లాగేందుకు ప్రయత్నించగా, సదరు మహిళ గొలుసును వదలకుండా పట్టుకోవడంతో సగం బంగారం మాత్రమే వారి చేతికి చిక్కింది.

3వ టౌన్ పరిధిలో కూడా మహిళ అప్రమత్తతతో సగం గొలుసును కాపాడుకోగలిగింది.ఈ నేరాలకు పాల్పడింది ఒకే గ్యాంగ్ కాదు, రెండు వేర్వేరు ముఠాలు.పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దుండగులు చోరీ చేసిన వాహనాలు తీసుకొని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వైపు వెళ్లిపోయారు అని అనుమానిస్తున్నారు.నగరంలో వరుస స్నాచింగ్‌లు కలకలం రేపడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ముఠా మహారాష్ట్రకు చెందినదిగా పోలీసులు దాదాపు నిర్ధారణకు రావడంతో, ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. సిసి కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను విశ్లేషిస్తూ దొంగల కోసం వేట కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments