HomeTelanganaNizamabadఅధికార పార్టీ లో గ్రామ సభ ల అలజడి .......సుదర్శన్ రెడ్డి ఇలాఖా లో...

అధికార పార్టీ లో గ్రామ సభ ల అలజడి …….సుదర్శన్ రెడ్డి ఇలాఖా లో రసాభాస ….

మంగళవారం నుంచి మొదలైన గ్రామ సభలు అధికార పార్టీని కుదిపేస్తున్నాయి. నిలదీతలు నిరసనల తో హోరెత్తుతున్నాయి. కీలకమైన సంక్షేమ పథకాలలో లబ్ది దారుల వడపోత కోసం నిర్వహిస్తున్న గ్రామ సభ లు ప్రభుత్వ వైఫల్యాలకు వేదికలుగా మారుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలకు ట్రాంప్ గా భావిస్తున్న కీలక పథకాల అమలు చేయడానికి ప్రభుత్వం ఆదిలోనే అడ్డంకులు కలుగుతున్నాయి. మొదటి రోజు మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్ సెగ్మెంట్ లోనే అనేక సభ ల్లో నిలదీతలు నిరసనలు హోరెత్తాయి.

సభ లో నిలదీతలు తో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులు లేక పోవడంతో అధికారులే ఎలాంటి విపత్తు లు ఎదుర్కోవడం అనివార్యంగా మారింది

అంబం, ఏ.ఆర్.పి క్యాంప్, జైతాపూర్, జంలం,కుర్నాపల్లి, మంగల్పహాడ్ గ్రామాల్లో సభ లు రసాభాసఅయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి.గ్రామసభకు పంచాయతీ కార్యదర్శులు అధ్యక్షత వహించి పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు చదివి వినిపిస్తున్నారు .

రైతు భరోసా పథకం వివరాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూలీలకు సంబంధించిన వివరాలు, రేషన్ కార్డుల లకు సంబంధించి అర్హులెవరనేది ఈ సభల్లో అధికారులు నివేదిస్తున్నారు ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కొన్నిచోట్ల గందరగోళం నెలకొంది.

కుర్నపల్లి గ్రామస్థులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామసభలో గందరగోళ పరిస్థితి ఏర్పడేలా చేశారు.విషయం తెలుసుకున్న ఎడపల్లి పోలీసులు గ్రామ సభకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు చేశారు.

అసలు లక్ష్యం దారి తప్పింది ఇతరాత్ర సమస్యలు తెరమీదికి తెస్తున్నారు దీనితో సభ నిర్వహణ దారి తప్పున్నయి కుర్నపల్లి గ్రామంలో గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో అధికారులు గ్రామసభ నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు.

గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ ఉపాధి హామీ పనుల్లో చాలా అవకతవకలు చేశాడని పిర్యాదు చేసినప్పటికీ అధికారులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

ఉపాధి హామీ కూలీలకు వచ్చే డబ్బులు కూలీలకు ఇవ్వకుండా ఫీల్డ్ అసిస్టెంట్ తన జేబులో వేసుకొని కూలీలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments