సంక్షేమ పథకాల్లో అర్హుల జాబితా ను ఖరారు చేసే విషయం లో ప్రభుత్వం నిర్దిష్టమైన నిబంధనలు జారీ చేసింది. కానీ మాజీ నూడా ఛైర్మెన్ ఓ సతీమతి మాజీ కార్పొరేటర్ పేరు సైతం సంక్షేమ పథకం అర్హుల జాబితా లో చేర్చారు.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్వాహకం చూసి అందరూ ఔరా అంటున్నారు. ఈ నెలాఖరు లో . నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
ఈ పథకాలకు సంబంధించి లబ్ది దారులను ఖరారు చేయడానికి సర్వే చేసింది. ఆ మేరకు ఆయా పథకాలకు అర్హులైన లబ్ది దారుల జాబితా ను అధికారులు ఖరారు చేశారు. అయితే లబ్ది దారుల జాబితా ను గ్రామ సభ ల్లో ప్రదర్శించి అభ్యంతరాలు వుంటే వారిని అర్హుల జాబితా నుంచి తప్పించాలి.
ఇందులో భాగంగానే మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు గ్రామ సభలు జరుపుతున్నారు. మొదటి రోజు సభల్లో అర్హుల జాబితా ఫై అనేక గ్రామాల్లో రసాభాసా జరిగాయి. రెండో రోజు బుధవారం నిజామాబాద్ నగరంలోని .43వ డివిజన్లో పాత అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన వార్డుసభ నిర్వహించారు.
ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి జాబితా ప్రకటించారు . కానీఈ జాబితాలో అనూహ్యంగా ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ పేరు రావడంతో అందరూ అవాక్కు అయ్యారు ఆమె నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ భార్య చామకూర విశాలిని రెడ్డి పేరు (సీరియల్ నంబర్ 106) రావడంతో అంతా ముక్కు మీద వేలు వేసుకున్నారు
ఇదెక్కడి చోద్యం ఇదే డివిజన్ లో రెండు అంతస్థుల భారీ భవనం మెయిన్ రోడ్డు మీదే ఉంది కదా ఆమె ఇందిరమ్మ ఇల్లు. కోసం ఎలా అర్హురాలు అయిందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీనితో అధికారులు ఎదో సాంకేతిక పొరపాటు జరిగింది అంటూఆ జాబితా లో నుంచి ఆమె పేరు తొలగిస్తామని హామీ ఇచ్చారు.
