మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు వేల్పూరు ఎస్ఐ సంజీవ్ తెలిపారు.
వివరాల ప్రకారం. సోమవారం రాత్రి పచ్చల నడికుడ గ్రామానికి చెందిన పులి తాగిన మైకంలో డయల్ 100 కు ఫోన్ చేసి న్యూసెన్స్ చేశాడు.
దీంతో అతనిని పట్టుకొని కేసు నమోదు చేసి మంగళవారం ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
