HomeCRIMEకుంభ మేళాలో విషాదం …….తొక్కిస లాట ……….యధావిధిగా పుణ్య స్నానాలు

కుంభ మేళాలో విషాదం …….తొక్కిస లాట ……….యధావిధిగా పుణ్య స్నానాలు

మహా కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య ను పురస్కరించుకొని పుణ్య స్నానాలు’ ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు.ప్రయాగ్ రాజ్‌లో పుణ్యం స్నానంచేసిన భక్తులు ఒడ్డున నిద్రిస్తున్న వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.రాత్రి సుమారు 1:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.


ఘటనలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏ మేరకు జరిగిందనేది ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు

@@@ యధావిధిగా స్నానాలు @@@

తొక్కిసలాటలో యాత్రికులు గాయపడటం, తెల్లవారుజామున భారీ రద్దీ కారణంగా తాత్కాలికంగా స్నానాలు నిలిపివేసినప్పటికి కొద్దిసేపటికే యధావిధిగా
పుణ్య స్నానాలకు అనుమతి ఇచ్చారు.

కేవలం సంగం రూట్లలో కొన్ని బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట ఏర్పడింది. కొంతమంది గాయపడ్డారు. అందరికీ చికిత్స అందుతోంది. పరిస్థితి అదుపులోనే ఉంది భక్తులు యధావిధిగా ఘట్టాలకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు.మహా కుంభమేళాలో ‘పుణ్యస్నానాలు’ కోసం బుధవారం 10 కోట్ల మంది రానున్నట్లుయూపీ ప్రభుత్వం అంచనా.వేసింది.

బుధవారం తెల్లవారు జామున ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు 1.75 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.. ఇప్పటిదాకా జనవరి 28 వరకు 19.94 కోట్ల మంది స్నానాలు చేసినట్లు ప్రకటించింది

////////// సమీపంలో ఉన్న ఘాట్ల లోనే స్నానం చేయండి యోగి పిలుపు /////////// .

స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు అధికారుల సూచనలు పాటించాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు.


‘మీరున్న చోటికి సమీపంలో ఉండే ఘాట్లలో స్నానాలు చేయండి. అందరూ నదీ సంగమం వద్దకే వెళ్లేందుకు ప్రయత్నించొద్దు’ అని ఆయన భక్తులను కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments