ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగ్గా 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.
ఈ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.
