HomeTelanganakamareddyపూర్వ విద్యా శాఖ స్థలాన్ని జిల్లా కోర్టు కేటాయించాలని సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు న్యాయమూర్థులకు ...

పూర్వ విద్యా శాఖ స్థలాన్ని జిల్లా కోర్టు కేటాయించాలని సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు న్యాయమూర్థులకు బార్ అసోసియేషన్ విన్నపాలు………

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుల నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్థులు అలిశెట్టి లక్మి నారాయణ, జె శ్రీనివాసరావు లకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి విడివిడిగా రెండు వినతిపత్రాలు వారికి అందజేశారు.

నిజామాబాద్ జిల్లాకోర్టు ఆవరణానికి అనుకుని ఉన్న ఓల్డ్ విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని న్యాయస్థానం అవసరాల కోసం కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు. పెరిగిన కోర్టుల సంఖ్య,దానికి అనుగుణంగా న్యాయవాదుల,కోర్టుసిబ్బంది కక్షిదారుల వాహనాలు పెరిగి పోవడం వలన జిల్లాకోర్టు ఆవరణ ఇరుకిరుగా మారిపోయి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది తెలిపారు.

మహిళలపై అత్యాచారాల,హింసను విచారించే ప్రత్యేక న్యాయస్థానం, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు,నిజామాబాద్ ఐదవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు,నిజామాబాద్ ప్రత్యేక పొక్సో కోర్టు జడ్జిల పోస్ట్ లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని భర్తీ చేయాలని విన్నవించారు.

వినతిపత్రాలు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్థులు సానుకూలంగా స్పందించి నట్లు జగన్ తెలియజేశారు కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి బార్ కోశాధికారి ఏ దీపక్ న్యాయవాది ఆరేటి నారాయణ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments