మోసాలకు ఇద్దరినీ నిందితులు అరెస్టు..పన్నెండు మంది నుంచి రూ 2.4 లక్షల నగదు టోకరా..అమాయకులను టార్గెట్ చేసుకుని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలిసులు రట్టు చేశారు. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసిపి రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
సయ్యద్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా అని వెతుకుతుండగా టెలిగ్రామ్ ఏంజీఐ అను యాప్ కనబడింది. ఈ యాప్ లో ఆన్లైన్ ద్వారా డబ్బులను పెట్టుబడి పెట్టి తద్వారా ఆధిక లాభాలను ఎలా రాబట్ట వచ్చో తెలుసుకున్నాడు.లాభాలు వస్తాయనే ఆశతో అతను జాయిన్ అయినాడు.
జాయిన్ అవ్వడమే కాకుండా తన మిత్రులను కూడా జాయిన్ చేయించడని తెలిపారు.సయ్యద్ ఇమ్రాన్ తన మిత్రుడైన షేక్ అమెర్ జాయిన్ అయ్యి తన ద్వారా వేరే వారిని కూడా అట్టి యాప్ యందు జాయిన్ చేయడమే కాకుండా అట్టి యాప్ ప్రచారానికై నిజామాబాద్ నగరం లో ముజాహిద్ నగర్, హష్మి కాలనీ తదితర ప్రాంతాలలో కార్యక్రమాలను నిర్వహిచాడు. ఈ కార్యక్రమాల నిర్వహణకు గాను సయ్యద్ ఇమ్రాన్ కు యాప్ నిర్వహకుల నుండి దాదాపు నలభై వేల రూపాయల వరకు డబ్బులు సమకూరాయి.
ఈ యాప్ యందు వివిద రకాలైన మోసపూరిత ఆఫర్లు చూపి నిందితులు అమాయక ప్రజలను మాయ మాటలతో ప్రేరేపించి మరియు నమ్మించి, వారిచే ఆన్లైన్ లో ఎంజిఐ యాప్ యందు పెట్టుబడి పెట్టి విదంగా చేసి, మోసపూరితంగా డబ్బులు సంపాదిస్తున్నారు.
ఇట్టి యాప్ యందు పెట్టుబడి పెట్టి మోసపోయిన భాదితులు పన్నెండు మంది నుండి రూ 2.42 లక్షల నగదు పోగొట్టుకోగా వీరే కాకుండా మరో కొందరు కూడా భాదితులు ఉన్నారను తెలిపారు.
బాధితుల సమాచారం మేరకు ఐదవ టౌన్ లో కేసు నమోదు చేసి నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఎస్ఐ లక్ష్మయ్య ఆద్వర్యంలో విచారణ చేపట్టి నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
