తాళం వేసిన ఇంట్లో భారీ చోరి జరిగింది. ఈ ఘటన సిరికొండ మండలం లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాటిపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య ఇంట్లో 14.5 తులాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని తెలిపారు. సత్తయ్య శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది.
బీరువాను చూడగా బంగారం పోయిందని బాధితుడు వాపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
