చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ ఆటో బ్యాటరీ పేలి దగ్ధమైంది. ఈ ఘటన నగరంలోని ధర్మపురి హిల్స్ లో జరిగింది.స్థానికుల కథనం ప్రకారం…ధర్మపురి హిల్స్ చెందిన మొహమ్మద్ మెహ్తుద్దీన్ బుదవారం రాత్రి తన ఎలక్ట్రిక్ ఆటోను ఇంటి ఆవరణలో చార్జింగ్ పెట్టి ఇంట్లొకి వెళ్ళాడు.
గంట వ్యవధిలో ఒక్కసారిగా ఆటో లో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ ఆటో పూర్తిగా దగ్ధమై ఇంటికి మంటలు వ్యాపించాయి.ఆటో యజమాని వెంటనే బయటకు వచ్చి చూసేసరికి పూర్తిగా దగ్ధమైంది.
