HomeTelanganaNizamabadగోడపత్రులను ఆవిష్కరించిన యూత్ కాంగ్రెస్ నాయకులు..

గోడపత్రులను ఆవిష్కరించిన యూత్ కాంగ్రెస్ నాయకులు..

నిజామాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ భవన్ లో నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ గారి అధ్యక్షతన జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది…

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఇంచార్జి రోష్ని జైస్వాల్ గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు దీపక్ గారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసే విధంగా పని చేయాలని అన్నారు..

ఈ నెల 18న యుఎస్ ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యలో మహా ధర్నా చేపట్టడం జరుగుతుంది అని అన్నారు… ఈ కార్యక్రమానికి జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చీబ్ గారు,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గారు మరియు ఇతర ముఖ్య నేతలు హాజరవుతారు…

అనంతరం మహాధర్నా కార్యక్రమం యొక్క గోడ పత్రులను ఆవిష్కరించారు…జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని అన్నారు…

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అనుపల్ కిరణ్,ఆదిత్య పటేల్,ఆకాష్ రెడ్డి,ఇర్ఫాన్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బోల్ల శ్రీకాంత్,అసెంబ్లీల అధ్యక్షులు కార్తీక్ యాదవ్,చరణ్ గౌడ్,మహేందర్,మెయిన్,జిల్లా, అసెంబ్లీల,మండలాల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments