HomeTelanganaNizamabadపట్టభద్రులు, టీచర్ల సమస్యలు బీజేపీ తోనే పరిష్కారం...పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి..

పట్టభద్రులు, టీచర్ల సమస్యలు బీజేపీ తోనే పరిష్కారం…పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి..

పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి..పట్టభద్రులు, టీచర్ల సమస్యల పరిష్కారం బీజేపీ తోనే సాధ్యమని పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఓ హోటల్ లో జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు తొత్తులుగా మారాయని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై పోరాటం చేస్తున్నది బీజేపీ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 మాసాలు గడిచిన విద్యారంగాన్ని,నిరుద్యోగుల మోసం చేసిందని తెలిపారు.

అలాగే అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ద్వజమెత్తారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఇచ్చిన నోటిఫికేషన్ లను వీరు ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పేర్కొన్న ఆరు గ్యారంటిలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని వ్యాఖ్యానించారు.

శాసన మండలి లో నిరుద్యోగుల,ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున గొంతు వినిపించేందుకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments