కామ్రేడ్ యాదగిరి వేసిన బాటల్లో ముందుకు నడుద్దాం అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు,ప్రగతి శీల మహిళ సంఘం అధ్యక్షురాలు గోదావరి అన్నారు. ఆదివారం ఖానాపూర్ గౌడ్స్ కాలనీలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ జిల్లా మాజీ కార్యదర్శి కామ్రేడ్ కర్నాటి యాదగిరి సబ్సిమనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
యాదగిరి జిల్లాలో విప్లవోధ్యమ నిర్మాణంకు పునాదులు వేసిన మూల స్థంభంలాంటి వాడని అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికి ఆదర్శంగా నిలిచాడనీ పేర్కొన్నారు. మొట్టమొదటగా మహిళ సంఘం ను ఏర్పాటు చేసిన ఘనత యాదగిరిదే అని చెప్పారు.సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో విప్లవ పార్టీలో తన కార్యక్రమాల్ని ప్రారంభించి, తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన కామ్రేడ్ యాదగిరి త్యాగధనుడన్నారు.
సమాజం మార్పులోనే తమ కుటుంబం కూడా భాగమని భావించి, అత్యవసర కాలంలో అజ్ఞాతవాసంలోకి వెళ్లి, గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్షను రూపుమాపడానికి, రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా ఉద్యమించాడని గుర్తు చేసుకున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం కి ఎనలేని కృషి చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు గంగన్న , టీటీసీఎస్ నంబర్ 2 అధ్యక్షులు డాక్టర్ సత్య నారాయణగౌడ్ , శ్రీహరిగౌడ్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు సత్యక్క , సునంద ,నర్సక్క ,జయప్రద , నాగమణి, లక్ష్మి , బాల్ లక్ష్మి, సుగుణ, లలిత , యాదమ్మ ,లత, మహిళలు పాల్గొన్నారు.
