నిజామాబాద్ నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగలు పడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసం ఉండే విద్యుత్ శాఖ లైన్మెన్ అజిత్ సింగ్ కుటుంబ సభ్యులు మంగళవారం ఓ ఫంక్షన్‌కు వెళ్లారు.
బుధవారం ఉదయం తిరిగి వచ్చినప్పుడు ఇంటి తలుపులు పగులగొట్టిన కనిపించాయి. అప్రమత్తమైన వారు లోనికి వెళ్లి చూసినప్పుడు ఐదు తులాల బంగారం, రూ. 85 వేల నగదు దోచుకుపోయినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్‌టీమ్‌తో విచారణ చేపట్టారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగుల ఆనవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
