అటవీ ప్రాంతంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి పై దాడి చేసి నగదు,ఫోన్ దోపిడీ చేస్తున్న దొంగలను పట్టుకొని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ సురేష్ కుమార్,ఎస్ఐ ఆరీఫ్ లు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు
. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లీ మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన పెంచల గీతేష్ నిజామాబాద్ నుంచి సొంత గ్రామం వెళ్తుండగా కుందన్ కుమార్,విజయ్ కుమార్,సుందర్ కుమార్ అను ముగ్గురు నిందితులు బుదవారం రాత్రి గీతేష్ ను రోడ్డుపై ఆపి అతనిని కట్టెలతో కోటి దాడి చేసినట్లు తెలిపారు.
అనంతరం ఆయన వద్ద ఉన్న రూ 1000 నగదు,సెల్ ఫోన్, కెమరా మిగితా వస్తువులు తీసుకొని పరారైనట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఫిర్యాదుదారుని సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా కొత్తపేట శివారులోని శ్రీ గంగా రైస్ మిల్ లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులపై అనుమానంతో విచారణ చేపట్టగా ముగ్గురు వ్యక్తుల పై నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు.
కుందన్ కుమార్,విజయ్ కుమార్,సుందర్ కుమార్ ముగ్గురు శ్రీ గంగా రైస్ మిల్ లో కూలీలుగా పనిచేస్తూ మద్యానికి బానిసై ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
దీంతో ముగ్గురు నిందితులను పట్టుకొని శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ సురేష్ కుమార్,ఎస్ఐ ఆరీఫ్ తెలిపారు.
