ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. . ఈ నెల 27న ఉదయం 8 నుంచి పోలింగ్ ఆరంభం కానుంది. పెద్దగా ప్రచారం లో అభ్యర్థులు హోరెత్తించలేక పోయారు. కానీ ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికల ప్రచారం పోటాపోటిగానే చేసాయి.
బిఆర్ యస్ ఎన్నికకు దూరంగా ఉంది. కానీ ఆపార్టీ లోపాయకారి గా ఎవరి వైపు మొగ్గు చూపింది బయటికి పొక్కనివ్వలేదు.ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ. కాంగ్రెస్ పార్టీ లు దిగ్గజ నేతలను రంగంలోకి దించాయి.అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు చూపెట్టింది.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం కు కీలక నేతలను ఇంచార్జ్ లుగా నియమించింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రెండు దఫాలుగా జిల్లాకు వచ్చారు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు. మరో బీజేపీ సైతం ప్రచారంలో మొదటి నుంచి ముందంజ లో ఉంది.
ఒక్కో ఒక్కో ఓటరు ను నేరుగా కలిసే కార్యాచరణ బీజేపీ అనుబంధ విభాగాలు గట్టిగా చేసాయి. మరోవైపు బీజేపీ అగ్ర నేతలు కిషన్ రెడ్డి లక్ష్మణ్ లు సైతం జిల్లాకు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ అర్వింద్ సైతం మూడు రోజలు ఇక్కడే మకాం వేసి యువ వోటర్ల తో భేటీ అయ్యారు.
ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం తో ముగిసింది. కానీ ఎన్నికను సవాల్ గా తీసుకున్న కాంగ్రెస్ బీజేపీ లు సాయంత్రం నుంచే ప్రలోభాలకు తెరలేపారు. ఒక్కోఓటరు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు.
ఒక్కో గ్రూప్ ను పిలిచి గంప గుత్తగా కాకుండా ఒక్కొరికి నేరుగా నగదు అందేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు.
/// పూర్తీ అయిన ఏర్పాట్లు ///
ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌కు మరో రోజే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం కొనసాగునుంది.
పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల నిబంధనల ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.
