యువతిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి యత్నించిన ఉదంతం కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ శివారు లోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ లో . శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
కాలనీలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు మద్యం సేవించి వస్తున్న క్రమంలో అదే ప్రాంతానికి వస్తున్న ఓ యువతిపై వెనుక నుంచి దాడి చేసినట్లు సమాచారం. వారిలో ఒకరు యువతి ముఖాన్ని చేతులతో పట్టుకోగా, మరొకరు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
దీంతో యువతి కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు బాలురను పట్టుకుని దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.మైనర్లు మద్యం మత్తులో యువతి ఫై అత్యాచారానికి యత్నించారనే కోణం కోణం దర్యాప్తు చేస్తున్నారు
