కంటేశ్వర్ రైల్వే అండర్‌పాస్ విస్తరణ పనుల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో డబుల్ ట్రాక్ పనుల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం నుంచి వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నారు. పనులు పూర్తయ్యే వరకు సుమారు 45 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లిస్తూ రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, ద్విచక్ర వాహనాలు, ఆటోల రాకపోకలకు పక్కనే ఉన్న మార్గంలో వెసులుబాటు కల్పిస్తున్నారు. కొన్ని మరమ్మతులు చేపట్టి కార్లు కూడా వెళ్లేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు.
అయితే పెద్ద వాహనాలు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.నగరంలోకి వచ్చే వాహనాలకు పాత మార్గమేఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ నగరంలోకి వచ్చే వాహనాలు కంటేశ్వర్ బైపాస్, మీ సేవ కంటేశ్వర్ మీదుగా పనులు పూర్తయిన రైల్వే అండర్‌పాస్ గుండా ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకోవాలి.
అక్కడి నుంచి కుడివైపు తిరిగి రైల్వే స్టేషన్ ఎదుటి మార్గంలో బస్టాండ్‌కు వెళ్లవచ్చు.బయటకు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ దారులునగరం నుంచి ఆర్మూర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ వైపు వెళ్లే వాహనాలు దేవీ రోడ్డు రైల్వే ఫ్లైఓవర్ మీదుగా దుబ్బ శివాజీ విగ్రహం, దుబ్బ రోడ్డు మార్గంలో ప్రయాణించాలి.
దుబ్బ చౌరస్తాలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం వద్ద ఎడమవైపు తిరిగి ఖానాపూర్ చౌరస్తాకు చేరుకోవచ్చు. మరో మార్గంగా జీజీ కళాశాల యూటర్న్ వరకు వెళ్లి బైపాస్ మీదుగా కంటేశ్వర్ డీఎస్ చౌరస్తాకు చేరుకునే అవకాశం ఉంది.
హైదరాబాద్‌కు మాధవనగర్ మీదుగా..హైదరాబాద్, కామారెడ్డి వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, పులాంగ్ చౌరస్తాల మీదుగా మాధవనగర్ రైల్వే గేటు దాటి, మాధవనగర్ బైపాస్ నుంచి హైదరాబాద్ రోడ్డుకు చేరుకోవాలి. బోధన్, బాన్సువాడ, వర్ని వైపు వెళ్లే వాహనాలు యథావిధిగా పాత మార్గంలోనే రాకపోకలు సాగించాలి.
*పెద్ద వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాలి..* * ట్రాఫిక్ ఎసిపి మస్తాన్ అలీ..అండర్‌పాస్ విస్తరణ పనుల నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు పక్కనే ఉన్న మార్గం ద్వారా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన మరమ్మతులు చేపట్టి కార్ల రాకపోకలకు కూడా వీలు కల్పిస్తున్నారు.
అయితే భారీ వాహనాలు, ఇతర పెద్ద వాహనాలు రద్దీని నివారించేందుకు నిర్దేశించిన ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాహనదారులు ఆంక్షలను గమనించి, పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రయాణించాలని కోరుతున్నారు.
