HomeCRIMEపట్టపగలే చోరీ.. రూ.2 లక్షల నగదు, తులం బంగారం అపహరణ

పట్టపగలే చోరీ.. రూ.2 లక్షల నగదు, తులం బంగారం అపహరణ

పట్టపగలే ఇంటి తాళం పగలగొట్టి దొంగలు నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాధవనగర్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాధవనగర్‌కు చెందిన మమ్మదేవి నిర్మల (72) తన కుమార్తె అపర్ణతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటికి తాళం వేసి బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉంది. బెడ్‌రూంలోని కబోర్డును పరిశీలించగా అందులో ఉంచిన రూ.2 లక్షల నగదు, తులం బంగారు ఆభరణాలు కనిపించలేదు.

గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సంఘటన స్థలాన్ని పరిశీలించామని, నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments