HomeTelanganaNizamabadక్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి...పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఏర్పాట్లపై సీపీ సాయి చైతన్య సమీక్ష

క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి…పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఏర్పాట్లపై సీపీ సాయి చైతన్య సమీక్ష

రాష్ట్ర పోలీస్‌ క్రీడా సంబరాలకు నిజామాబాద్‌ వేదిక కానుంది. నవంబర్‌లో నిర్వహించనున్న 5వ తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌–2026 ముగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పోలీస్‌ యంత్రాంగం సమాయత్తమవుతోంది.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య అధికారులను ఆదేశించారు.నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో క్రీడా పోటీల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు.

క్రీడా మైదానాలు, ట్రాక్‌ల సిద్ధీకరణతో పాటు క్రీడాకారులకు వసతి, భోజనం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచడంపై దిశానిర్దేశం చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.

క్రీడా పోటీల్లో పాల్గొనే పోలీస్‌ సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని వైద్య బృందాలను, ప్రథమ చికిత్స సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని సీపీ సూచించారు. వివిధ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్రీడాకారులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా జన్కంపేట పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, అలీసాగర్‌, నాగారం గ్రౌండ్‌, కాలూరు రోడ్డు, ప్రభుత్వ స్విమ్మింగ్‌ పూల్‌, ముగుపల్‌ ఆర్చరీ అకాడమీ తదితర వేదికల్లో పోటీలు నిర్వహించనున్నారు.

సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్‌) ఎన్‌. శుభం ప్రకాష్‌, వివిధ విభాగాల ఏసీపీలు ప్రకాష్‌, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, కృష్ణ, నరేందర్‌, గురునాయుడు, మస్తాన్‌ అలీ, డీవైఎస్‌ఓ బి. పవన్‌కుమార్‌, ఆర్చరీ కోచ్‌ రవీందర్‌, స్విమ్మింగ్‌ కోచ్‌ మహిపాల్‌రెడ్డి, అథ్లెటిక్స్‌ కార్యదర్శి రాజా గౌడ్‌, తెలంగాణ సైక్లింగ్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ విజయ్‌కాంత్‌రావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజ్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments