సాగు నీటి సమస్యను అధికారులెవరూ పట్టించుకోవడంలేదని రైతులు నీటి పారుదల శాఖ అధికారులను నిర్బంధించారు.
సాలురా మండలంలోని క్యాంపు గ్రామ ప్రజలు తమ పంటలకు నిజాంసాగర్ కెనాల్ ద్వారా నీటిని అధికారులు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి పారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయనీ మండిపడ్డారు. ఈ మేరకు పంచాయతీ భవనంలో నీటి పారుదల శాఖ అధికారులను నిర్బంధించారు.
దీంతో బోధన్ రూరల్ మండల పోలిసులు ఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో,అధికారులతో మాట్లాడుతున్నారు.
