ఆర్టీసి బస్సు ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో గురువారం మాక్లూర్ మండలంలోనీ గుత్పా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ కు చెందిన గవారే గణేష్(45). ఇతనితో పాటు మరో కొందరు మాక్లూర్ మండలంలోనీ గుత్పా జాతీయ రహదారిపై రోడ్డు మరమత్తులు పనులు చేస్తున్నారు. వీరందరూ రోడ్డు దాటే సమయంలో నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్నా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆర్టీసి డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
