HomeTelanganaNizamabadజగదీష్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ .......క్షమాపణ చెప్పాలని డిమాండ్

జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ …….క్షమాపణ చెప్పాలని డిమాండ్

అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఆందోళనకు దిగింది.

నిజామాబాద్నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ల ఆధ్వర్యంలో కేటీఆర్ ,జగదీశ్ రెడ్డి ఇద్దరి దిష్టిబొమ్మలుదగ్ధం చేశారు.

ఈ ఆందోళనలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హంధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ దళితులను గిరిజనులను బీసీలను అవమానిస్తూనే ముందుకు వెళ్లిందని, ప్రస్తుతం అసెంబ్లీలో కేటీఆర్ బరితెగించి తన ఎమ్మెల్యేలతో కలిసి దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై అనుచిత వాక్యాలు చేయడాన్ని మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.మున్ముందు ఇలాంటి వాక్యాలు చేస్తే గుణపాఠం చెప్తామని, దళితులు గిరిజనులు మీ అంతు చూస్తారని హెచ్చరించారు.

ఖబడ్దార్ కేటీఆర్ గత 14 నెలలుగా అధికారం పోయిన నుండి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు అందరినీ అవమానించేలా ఉన్నాయని, మీ శాసనసభ్యుడు స్పీకర్ను అవమానించి మాట్లాడితే దానిని నువ్వు సమర్థించడం అనేది కెసిఆర్ నుండి నీకు వచ్చిన దొర అహంకారమేనని,రాబోయే కాలంలో దళితులు గిరిజనులు మిమ్మల్ని మరింత పాతాళానికి తొక్కుతారని, వెంటనే స్పీకర్ గారిపై అనుచిత వాక్యాలు చేసిన జగదీష్ రెడ్డి దానిని సమర్థించిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి అని డైమండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డీ రాజారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,మాజీ పీసీసీ కార్యదర్శి రం భూపాల్,మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి,రాష్ట్ర nsui ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి,జిల్లా ఫిషెర్మన్ అధ్యక్షులు శ్రీనివాస్,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,లవంగ ప్రమోద్,అయ్యూబ్, అవీణ్, బింగి మాడు సుధన్,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష,విజయలక్ష్మి,అపర్ణ,జగడం సుమన్,ఆంతరెడ్డి విజయపౌల్, మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments