HomeTelanganaNizamabadకాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వం..10 ఏళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు పట్టలేదు.. పిసిసి చీఫ్...

కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వం..10 ఏళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు పట్టలేదు.. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పడానికి జిల్లా కేంద్రంలో రైతుమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభం చేశామని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి మరో రాష్ట్రం లేదని తెలిపారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకోసం అహర్నిశలు పని చేస్తుందని తెలిపారు. 10 ఏళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు పట్టించుకోలేదని,అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల మేలుకోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.

సుదర్శన్ రెడ్డి కోరిక మేరకు ఈ రైతు మహాసభ ఎక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సదస్సులో పేరు గాంచిన వ్యవసాయ అధికారులతో,అధునాతన టెక్నాలజీ లతో తక్కువ వ్యయం,తక్కువ శ్రమ తో ఎక్కువ లాభం పొందేవిధంగా రైతులకు కొత్త పద్ధతులు నేర్పాలని ఉద్దేశ్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు.

ఇక నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయానికి పేరున్న జిల్లా, ఇక్కడ ఎన్ఎస్ఎఫ్, ఎన్ సిఎఫ్, యావత్ ఆసియా గొప్ప పరిశ్రమ ఉన్న జిల్లా అని గుర్తు చేశారు.1923 లో నిజాంసాగర్ ఆయకట్టు ప్రారంభమైనప్పుడు 2 లక్షల ఎకరాల సాగు కొరకు ప్రాజెక్టు ఏర్పడిందని గుర్తు చేశారు.క్రమేణ 17 టీఎంసీ కుడుచుకుపోయింది అన్నారు.

మళ్ళీ కాంగ్రెస్ హయంలోనే పూడిక తీసి నీటి నిల్వకోసం మరమత్తులు చేయించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో వడ్ల కుప్పల్ పైన ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకమున్నాయని విమర్శించారు.

రైతులపైన లాటి చార్జీలు చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అనేక రైతు వ్యతిరేక చట్టాలు చేసి రైతులను మోసంచేశారని ద్వజమెత్తారు. దేశంలో మరకెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 80శాతం మందికి సన్నరకం బియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవారు ధనవంతుడితో సమానంగా సన్నరకం బియ్యం తో భోజనం చేస్తున్నారని తెలిపారు.మిగతా రాష్ట్రాలకన్నా అత్యధిక ధాన్యం ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరిగిందని, గత రెండు సీజన్‌లో 2.85కోట్ల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు సాధించామని చెప్పారు.

ప్యాకేజీ 20,21 తీసుకొచ్చిన ఘనత సుదర్శన్ రెడ్డి దేనని,ఆయనకు ఎక్కడ మంచి పేరువస్తుందోన్నని దాన్ని మధ్యలోనే పక్కన పెట్టారని పేర్కొన్నారు.జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేస్తాం..

రైతు సదస్సులో పాల్గొన్న మంత్రులు నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తామని తెలిపారు.అదేకాకుండా జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల కావాలని ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకపోతామని తెలిపారు.

అదే విధంగా నిజామాబాద్ క్రీడాకారుల జిల్లా అందుకు ఎక్కడ మినీ స్టేడియం,సింథటిక్ ట్రాక్ కూడా వస్తుందని హామీ ఇచ్చారు.ఇక ఇండోర్ స్టేడియం కట్టడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.అలాగే పరిశ్రమలు కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.మరొక సుగర్ ఫ్యాక్టరీ తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

బిఆర్ఎస్ 10 ఏళ్లలో జిల్లాకు ఏం చేశారు?బిఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో చేసిన ఒక్క పని చెప్పారు.జిల్లాకు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా,ఒక్క ఎకరానికి అదనంగా నిరందించారా అని ప్రశ్నించారు.జిల్లాకు ఏం ఇవ్వకుండా రైతుల నడ్డివిద్చి రైతుల ప్రాణాలు తీసిన ప్రభుత్వమని విమర్శించారు.

కేసీఆర్, కేటీఆర్ 10 ఏళ్లలో నిజామాబాద్ చేసింది చూయించండని ప్రశ్నించారు. జిల్లా నుంచి మంత్రిగా ప్రశాంత్ రెడ్డి ఉన్న జిల్లాకు ఏంచేసారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇక జిల్లాలో బిఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి పై దేశం మొత్తం చర్చించుకుంటుందని అన్నారు.

రాజుల గాంధీ కళా అయిన కుల సర్వే చేసిన ఘనత,విద్యా ఉద్యోగం,లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, మనల మోహన్ రెడ్డి, తాహిర్ బిన్ హందాని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments