HomeCRIMEసీఐడీ మెరుపు దాడులు ......అదుపులో ఆరుగురు మిల్లర్లు

సీఐడీ మెరుపు దాడులు ……అదుపులో ఆరుగురు మిల్లర్లు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలలో రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడులు చేసి పలువురు మిల్లర్ల ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎఫ్సీఐకు బియ్యాన్ని పంపే విషయంలో వీరు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

సివిల్ సప్లై కి సన్న బియ్యాన్ని పంపే క్రమంలో వాటి స్థానంలో దొడ్డు బియ్యాన్ని పంపినట్లు తెలిసింది. సదరు వ్యాపారులు ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో అధికారులు ఆగ్రహం చెందారు.


ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ భారీ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించగా, రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నలుగురు మిల్లర్లను నేరుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
మిల్లర్ల ను అదుపులోకి తీసుకోవడంతో రైస్ మిల్ వ్యాపారస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments