రైల్వే ప్రయాణికుడి మొబైల్ ఫోన్ చోరీ కేసును నిజామాబాద్ రైల్వే పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.15 వేల విలువైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్‌ఫాంపై రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన జి. సాయినాథ్ (39)ను అదుపులోకి తీసుకుని విచారించారు.
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 204/2026, బీఎన్ఎస్ సెక్షన్ 305(సి) కింద నమోదైన మొబైల్ చోరీ కేసులో అతడి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అతడి వద్ద నుంచి ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
