HomeCRIME36 కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్‌ అరెస్ట్‌

36 కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్‌ అరెస్ట్‌

ఆరు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితుడుకత్తి, రిజిస్ట్రేషన్‌ లేని బైక్‌ స్వాధీనంపలు తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీషీటర్‌ ఆబిద్‌ బిన్‌ ఖలీద్‌ అలియాస్‌ లల్లాను మంగళ్‌హాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరు నెలలకు పైగా పరారీలో ఉన్న అతడిని అక్టోబర్‌ 23న ఆర్‌.కె. పేట్‌ జంక్షన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి నుంచి పదునైన కత్తి, రిజిస్ట్రేషన్‌ లేని బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ 200 బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కుల్సుంపురా డివిజన్‌ ఏసీపీ వి. తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్‌, ఆసిఫ్‌నగర్‌ సహా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఆబిద్‌పై 36 కేసులు నమోదయ్యాయి.

హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు, మత్తు పదార్థాల అక్రమ రవాణా తదితర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. 2008లో మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై రౌడీషీట్‌ తెరిచారు. గతంలో మూడుసార్లు పీడీ యాక్ట్‌ ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు.

మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎన్‌డీపీఎస్‌, ఆర్మ్స్‌ యాక్ట్‌, బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కేసుతోపాటు ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మరో కేసులోనూ ఆబిద్‌ పరారీలో ఉన్నాడు. మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మరో కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ పెండింగ్‌లో ఉంది. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు సమాచారంతో అతడిని పట్టుకున్నారు.

కత్తి కలిగి ఉన్నందుకు ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద మరో కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. గోల్కొండ జోన్‌ డీసీపీ జె. రాఘవేందర్‌ రెడ్డి మార్గదర్శకత్వంలో, కుల్సుంపురా డివిజన్‌ ఏసీపీ వి. తిరుపతి పర్యవేక్షణలో మంగళ్‌హాట్‌ ఎస్‌హెచ్‌ఓ ఎస్‌. రాఘవేంద్ర, డీఐ పి. మహేందర్‌, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments