నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకమైన రెండు వంతెనల నిర్మాణంపై కదలిక వచ్చింది. మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సమావేశమయ్యారు. డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డితో పాటు జిల్లా నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు అవసరమైన నిధుల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వంతెనల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని వివరించారు. నేతల విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు అంగీకరించినట్లు తెలిపారు.
ఈ రెండు వంతెనల నిర్మాణం పూర్తయితే నగరంలో రాకపోకలు సులభతరమవడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఊతం లభించనుంది.
