ఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించిన ఆర్డీవో రాజా గౌడ్ – రైతులకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి కిసాన్ బిజెపి నాయకులు నూతుల శ్రీనివాస్ అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డు ఎక్కారు.
గత 20 రోజులుగా రోడ్లపైనే ధాన్యం వర్షం నానుతూ, ఎండకు నిండుతూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యాన్ని షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్, ఆర్ డి ఓ రావాలంటూ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు బైపాస్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు.
కలెక్టర్, ఆర్ డి ఓ రావాలంటూ నినాదాలు చేశారు.వాహనాలకు అడ్డంగా పడుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు రైతులకు మధ్య తీవ్రవాదం చోటుచేసుకుంది.
ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. గత 20 రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో రాజా గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు.
తడిసిన ధాన్యాన్ని రైతులు స్వయంగా ఆర్డీవోను తీసుకెళ్లి చూపించారు. ధాన్యాన్ని సకాలంలో కొనులు చేసే విధంగా చర్యలు చేపడతామని ఆర్డిఓ అన్నారు.
ఈ నిరసనలో ఆర్మూర్ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, కిసాన్ బిజెపి నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పలువురు మద్దతు తెలిపారు.
