HomeTelanganaHyderabadమిల్లర్ల దబాయింపు వ్యూహం ....మింగిన ధాన్యం కక్కలేక రచ్చ .......వెనక్కి తగ్గని సర్కార్ ....

మిల్లర్ల దబాయింపు వ్యూహం ….మింగిన ధాన్యం కక్కలేక రచ్చ …….వెనక్కి తగ్గని సర్కార్ ….

ఉల్టా చోర్ కొత్వాల్ కో దాటే అన్నట్లుగా ఉంది రైస్ మిల్లర్ ల వైఖరి. మింగేసిన ధాన్యం వెనక్కి ఇవ్వాలని అడిగిన సర్కార్ మీద ఎదురు దాడికి కోసం నిరసన గళం ఎత్తారు.ధాన్యం కోట్ల రూపాయల విలువైన ధాన్యం పంది కొక్కుల మాదిరిగా మింగేసిన మిల్లర్లు ను సర్కార్ వెంటాడుతుంది.

సోదాలు కేసులతో కొరడా ఝుళిపిస్తుంది.మింగిన సొత్తు కక్కేయమని ఉరుముతుంది. ఉక్కిరిబిక్కిరి అవుతున్న మిలర్లను ఈసారి అధికార పార్టీ అగ్ర నేతలెవ్వరూ చేరదీయడం లేదు. కోర్టు ఆదేశాలతో కేసుల నుంచి ఉపశమనం దక్కించుకున్న మిల్లర్లు ఇప్పుడు ఎదురు దాడికి సిద్ధం అవుతున్నారు.

సర్కార్ ను తమ చెప్పు చేతుల్లో కి తెచ్చుకోవడానికి వ్యూహరచన అమలు చేస్తున్నారు. సియం ఆర్ కింది కేటాయించిన ధాన్యం ఇవ్వాలంటూ సర్కార్ అన్నివైపుల ఒత్తిడి చేస్తుండడం తో రచ్చ కు తెరలేపారు అనేక డిమాండ్ లను తెరమీదికి తెచ్చారు రెండు రోజులపాటు మిల్లలను మూసేసారు గత దశాబ్ద కాలంలో మిల్లర్లు అంత ఒక్కతాటి మీదికి వచ్చి ఆందోళనకు దిగడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

సీఎం రేవంత్ రెడ్డి తన పోర్ట్ ఫపోలియో కాక పోయిన సరే ఈసారి మిల్లర్ల నుంచి ధాన్యం వెనక్కి వచ్చే దాక వదిలేది లేదంటూ కఠినంగా ఉన్నారు అందుకే ఆయన పరిదిలో పనిచేసే విజిలెన్స్, పోలీసు శాఖలను మిల్లర్ల మీదికి పురమాయించారు.

మిల్లర్ల తో దోస్తీ ఉన్న అధికార పార్టీ అగ్ర నేతలు మొదటి హడావుడి చేసి ఆ తర్వాత చేతులెత్తాశారు ఎహే వెళ్లి స్టే తెచ్చుకోండి అంటూ సలహాలు ఇచ్చారు. విజిలెన్స్ అధికారుల పిర్యాదు లతో కేసులు నమోదు చేసిన పోలీసులు షరా మామూలుగానే ధాన్యం కేసు ల దర్యాప్తు లను అటకెక్కించారు.

ఇదివరకు కేటాయించిన ధాన్యం వెనక్కి ఇవ్వడానికి మొదట మిల్లర్లు సిద్ధం అయ్యారు.ఈ మేరకు అసోసియేషన్ పెద్దలు సివిల్ సప్లై కమిషనర్ కు సైతం భరోసా ఇచ్చారు. కానీ చాలావరకు మిల్లు లో గతంలో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ను ఎప్పుడో చేతులు మారిపోయింది.

అందుకే నాణ్యత లేని ధాన్యం ఇవ్వడానికి పథకం వేసిన మిల్లర్లు ఇప్పుడు అనూహ్యంగా ఆందోళన బాట పట్టడం వెనుక ఏ మంత్రాంగం నడిచిందో ప్రభుత్వ వర్గాలకు అంతు చిక్కడం లేదు పైగా గతంలో కత్తులు దూసుకున్న మిల్లర్లు రెండు సంఘాలు విడిపోయారు కానీ వీరంతా ఇప్పుడు ఒక్క తాటి మీదికి వచ్చేసారు.

తాము మెక్కేసిన ధాన్యం జోలికి రాకుండా ఉండే ఎత్తుగడ కు సిద్ధం అయి కొత్త డిమాండ్ లతో రెండు రోజులు మిల్లలను మూసేసి నిరసన గళం అనుకుంది.నిస్సుగ్గుగా సర్కార్ ను దబాయించే పని లో పడింది.కానీ రెండు రోజుల మిల్లుల మూసివేత ఆందోళనను సర్కార్ లైట్ తీసుకుంది కానీ ఖరీఫ్ సీజన్ లో వచ్చే ధాన్యం కొనుగోళ్ల పక్రియ లో ప్రతిష్ఠబన తలెత్తే ప్రమాదం కూడా ఉంది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments