HomeCRIMEనందిపేటలో భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డన్ సెర్చ్): 52 వాహనాలు సీజ్, 4 అనుమానితులు అరెస్ట్...

నందిపేటలో భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డన్ సెర్చ్): 52 వాహనాలు సీజ్, 4 అనుమానితులు అరెస్ట్ – పోలీసుల మెరుగైన భద్రతా చర్యలు

నందిపేట మండల కేంద్ర రాజ్ నగర్ దుబ్బ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నందిపేట పోలీస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎసిపి, ముగ్గురు సీఐలు, 9 మంది ఎస్ఐ లు,102 మంది పోలీసుల బందోబస్తు నడుమ కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డన్ సెర్చ్) నిర్వహించడం జరిగింది.

ఈ గార్డన్ సెర్చ్ లో 52 ద్విచక్ర వాహనాల సంబంధిత పత్రాలు లేనందున సీజ్ చేయగా బయోమెట్రిక్ (పాపిలాన్ డివైస్) ద్వారా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాలనీ కూడలి వద్ద గల హనుమాన్ టెంపుల్ దగ్గర యువతను ఉద్దేశించి కమ్యూనిటీ కాంటాక్ట్ గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ…. నిజాంబాద్ జిల్లా సిపి ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ప్రజల సంరక్షణ కొరకే పోలీసు సిబ్బంది ఉందని, మనతో పాటే నేర ప్రవృత్తి గల వ్యక్తులు సంచరిస్తుంటారని వారి బారిన పడకుండా, మోసపోకుండా సమాజంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, అటువంటి వారిని గుర్తించేందుకే ఈకార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు.

అలాగే ఆన్లైన్ మోసాలకు, మత్తు పదార్థాలకు యువత బలికావద్దని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరూ పాటించాలని సమాజంలో ఇతరులను ఇబ్బంది పెట్టే ఎటువంటి విషయమైనా, వ్యక్తులైన రాజీ పడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

అంతేకాకుండా ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలలో కమ్యూనల్ విషయాలపై అప్రమత్తంగా ఉండి అసత్య ప్రచారాలకు లోనవ్వకుండా వాట్సాప్ గ్రూప్ లలో లైక్ లు షేర్ లాంటివి పెట్టకూడదని, అటువంటి వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments