ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నీది ద్వారా 64 మందికి 22,28,000 రూపాల విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు..
మహాలక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిందని, తులం బంగారం హామీకీ తూట్లు పొడిచారాని ఎద్దేవ చేసారు.
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారుని దరఖాస్తులను సెక్రటరేట్ కి పంపించడం జరుగుతుందని అన్నారు..
రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని లక్షల్లో ఖర్చు ఉంటే 15వేలు, 20వేలు ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందని అన్నారు..
బాధితులు అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేల చర్యలు తీసుకోవలని డిమాండ్ చేసారు.గత ఎమ్మెల్యే హయాంలో సంవత్సరాలు గసిన చెక్కులు రాలేదని ఇప్పుడు అప్లై చేసుకున్న 3 నెలలో చెక్కులు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యే గారికి లబ్ధిదారులు అందరు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు,మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
