HomeTelanganaNizamabadమోసాన్ని నిలదీస్తే సంకెళ్ళనిరుద్యోగుల అరెస్టులు దారుణం వారికి అండగా నిలుస్తాం,–బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే...

మోసాన్ని నిలదీస్తే సంకెళ్ళనిరుద్యోగుల అరెస్టులు దారుణం వారికి అండగా నిలుస్తాం,–బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నయవంచనకు పాల్పడిన కాంగ్రెస్ సర్కారు మోసాన్ని నిలదీసిన నిరుద్యోగుల చేతులకు సంకెళ్ళు వేస్తారా?అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు , ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.

హామీలు అమలు చేయమన్న పాపానికి ఇంత నిర్బంధకాండను అమలు చేయడం నిరంకుశమన్నారు ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత హేయమైన చర్య అని జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం ఏడాది లోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీతో పాటు ప్రతినెల నిరుద్యోగులకు రూ.4000 చొప్పున నిరుద్యోగ భృతి, ఆడపడుచులకు రూ. 2500, 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇవ్వడం వంటి హామీలను ఎందుకు అమలు చేయలేదని ఆయన నిలదీశారు.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించని కారణంగా విద్యార్థులు ఉత్తీర్ణులైనప్పటికీ వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు..

ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ సోదరులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని,రేవంత్ రెడ్డి సర్కారు ద్రోహాన్ని ఎండగడతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments