భర్త అంత్యక్రియలు ముగించుకొని ఇంటికి వచ్చే సరికి భార్య మృతివిషాదంలో కుటుంబ సభ్యులు..మృత్యువు వారి బంధాన్ని విడదీయలేకపోయింది.
పెళ్లి నాడు ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని చేసి న బాసలు నిలబెట్టుకున్నారు. ఏడడుగుల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు చావులోనూ ఒక్కట య్యారు.అయితే విధి ఆడి న వింత నాటకంలో నువ్వులేక, నేనులేను అంటూ ఒకరి వెంట ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిరిపురం నడ్పి నర్సయ్య (76), ఆయన భార్య నర్సవ్వ(68) బుధవారం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న నర్సయ్య బుధవారం ఉదయం మృతి చెందారు.
కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసి ఇంటికి రాగా, భార్య నర్సవ్వ కూడా చనిపోయారు. ఒకేసారి దంపతులు మృతి చెందడంతో కుటుంబం, గ్రామంలో విషాదం నెలకొంది.
