ఆర్మూర్ నియోజక వర్గంలో స్థానిక సంస్థల అన్ని సీట్లు గెలవాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు ఆయన బుధవారం గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజక వర్గ నాయకుల సమావేశంలో మాట్లాడారు
కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా కష్టపడి పని చేసి సర్పంచ్, ఎంపిటిసి, జడ్పీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ లు అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు
ఆర్మూర్ నియోజక వర్గాన్ని నా స్వంత నియోజక వర్గంగా చూసుకుంటా. కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పని చేసుకొని పరిష్కరించుకుందామని ఏవైనా సమస్యలు ఉంటే ఇంచార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళితే నేనే,వినయ్ వెంట ఉండి పని చేసి పెడతామని మహేష్ భరోసా ఇచ్చారు
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ,మండల మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
