HomeCRIMEఏటీఎం లూటీ ఛేదించేనా?మహారాష్ట్ర ముఠా పోలీసులు అనుమానాలు..రంగంలోకి దిగిన పోలీస్ కమిషనర్...

ఏటీఎం లూటీ ఛేదించేనా?మహారాష్ట్ర ముఠా పోలీసులు అనుమానాలు..రంగంలోకి దిగిన పోలీస్ కమిషనర్…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఏటీఎం ను గుర్తు తెలియని దుండగులు చోరి యత్నానికి పాల్పడ్డారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సినిమా రేంజ్ లో చేజింగ్ చేసిన దుండగులు వారి వెంట తీసుకు వచ్చిన వాహనం వదిలేసి పరారయ్యారు.

దీంతో స్వయంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రంగంలోకి దిగి లూటీ యత్నం చేసిన స్థలానికి చేసుకొని వివరాలపై ఆరా తీశారు.దీంతో పలు గ్రూపులుగా అధికారులను విడదీసి దుండగుల కోసం ఆరా తీస్తున్నారు.

ఈ మేరకు ఏటీఎం చోరియత్నం చేసిన దుండగులు అంతకు ముందు రోజు మహారాష్ట్ర లో ఓ కారు ను చోరి చేసి అదే కారులో జిల్లాకు వచ్చారు.

మహారాష్ట్ర నుంచి నేరుగా దొంగలించిన వాహనంలో ఆర్మూర్ లోని ఓ ఏటీఎం కు వెళ్ళారు.అక్కడ చోరి చేయడానికి ముందుగా ఓ స్ప్రే ను వాడి చోరి కి పాల్పడే లోపే స్థానికులను గమనించి అక్కడి నుంచి పరారయ్యారు.

ఆర్మూర్ లో వీలు కాకపోవడంతో నగరంలోని చంద్రశేఖర్ కాలనీలోని ఏటీఎంలో లూటీ యత్నం చేశారు. లూటీ చేసే సమయంలో పోలీసులు రాకను గమనించిన దొంగలు హుటాహుటి ఏటియం నుంచి బయటికి వచ్చి మారుతి ఓమిని వ్యాన్లో కొత్త కలెక్టరేట్ వైపు పారిపోయారు.

ఎస్సై వారిని వెంబడించారు. పెట్రోలింగ్లో ఉన్న రెండు వాహనాలు వెంటాడంతో పొల్లా గ్రామం వద్ద తమ వాహనం వదిలేసి చీకట్లో తప్పించుకున్నారు.

దీంతో పోలీసులకు మహారాష్ట్రకు చెందిన పాత నేరస్తులుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments