Saturday, April 18, 2026
HomeLaw and Orderడి.జేలకు ఎలాంటి అనుమతులు లేవు పూర్తిగా నిషేధం..గణేష్ మండలి నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలి: ..మండపం...

డి.జేలకు ఎలాంటి అనుమతులు లేవు పూర్తిగా నిషేధం..గణేష్ మండలి నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలి: ..మండపం వద్ద విధ్యుత్ తీగలతో జాగ్రత్తలు పాటించాలి. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలి.. –పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి

గణేష్ ఉత్సవాలలో డీజే లకు ఎలాంటి అనుమతులు లేవని డీజేలను పూర్తి నిషేధం విధించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. గణేష్ మండపాలను ఎవరికి,ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.

మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. గణేష్ మండళ్ల వద్ద సందర్శించే మహిళలపై, యువతులపై” ఈవ్ టీజింగ్” జరుగకుండా చూడాలని తెలిపారు.

ప్రజలకు అసౌకర్యం కలుగకుండా డి.జె / డి.జె మిక్సర్స్ / హైఫిడిలిటి ( హైఫై ) సౌండ్స్సిస్టమ్ ఇక్విప్మెంటు విషయంలో చాలా జాగ్రతలు వహించాలి.

కొద్ది మంది ఇండ్లలో గుండె జబ్బులు గలవారు, బి.పి గలవారు, వయసు పై బడిన వృద్దులు ఉంటారు. చదువుకునే విద్యార్థులకు ఆటంకము కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్టి సౌండ్ 12 డెసిబెల్స్ దాటి ఉండరాదన్నారు. రాత్రి 10-00 గంటలకు ” లౌడ్ స్పీకర్లు” ఆఫ్ చేయాలి.

ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలి. లేని యెడల చట్టరిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డి.జే లు పూర్తిగా నిషేదం తీసుకోవాలి. మైక్ పర్మీషన్ కోసం సంబంధిత ఎ.సి.పి ని సంప్రదించి తప్పని సరిగా పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. మండపంలో తప్పని సరిగా వలంటరీలు రోజంతా ఉండాలని సూచించారు.

మండపాల వద్ద విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన విద్యుత్‌ పరికరాలను వాడాలని, ప్రతి గణేశ్‌ మండపం వద్ద విధిగా పాయింట్‌ బుక్స్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీజే లు శాంతికి భంగం కలిగించే బిగ్గరగా, భక్తి లేని లేదా రెచ్చగొట్టే పాటలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి.

మండపాల వద్ద బాణసంచా నిల్వ చేయవద్దు.ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర మతపరమైన ప్రదేశాల దగ్గర శబ్దం లేదా భంగం కలిగించకుండా ఉండండి.మద్యం సేవించడం, జూదం లేదా చుట్టుపక్కల ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలుమండపం ఖచ్చితంగా నిషేధించబడింది.

అక్రమ విద్యుత్ కనెక్షన్‌లను డ్రా చేయవద్దు లేదా ఉపయోగించవద్దు; అధికారం కలిగిన విద్యుత్ కనెక్షన్‌లను మాత్రమే ఉపయోగించాలి.ఊరేగింపు ప్రారంభమయ్యే సమయంలో ఏనుగులను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి.

ప్రజలందరి సహకారంతో గణేశ్‌ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలన్నారు. సోషల్‌మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, వదంతులు ప్రజలు నమ్మవద్దన్నారు. వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!