ఓటరు జాబితా సవరణపక్రియ లో మొదటి అంకం ముగిసింది. జూన్ 25న మొదలై 45 రోజుల పాటు సాగిన కీలక ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం వినతితో రెండుసార్లు గడువు పొడిగించింది .
అయినప్పటికీ జిల్లాలో రెండు లక్షల కు పైగా ఓటర్లు ఎన్యూమరేషన్ఫారాలను సమర్పించలేదని ప్రాథమిక అంచనాగా అధికారులు చెప్తున్నారు . దాదాపు 14.72 శాతం మేరకు వోట్లు నమోదు కాలేదు. అర్బన్ నియోజకవర్గంలోనే అత్యధికంగా వోట్లుగల్లంతు అయ్యాయి దాదాపు 83 వేల వోట్లు గల్లంతు అయ్యే అవకాశం ఉంది.వీరికి ఇక ఓటు హక్కు ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఈసీ ప్రకటించిన లెక్కల ప్రకారం.. 14.39 లక్షల మంది ఓటర్లు ఉంటే 12.27 లక్షల మంది ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు.
మిగిలిన 2.11 లక్షల మంది ఓటర్లు తమ ఫారాలను సమర్పించలేదు. ఇందులో అత్యధికంగా ముందు నుంచి ఉహించినట్లుగానే నిజామాబాద్ అర్బన్ టాప్‌లో ఉంది.జిల్లా వ్యాప్తంగా 33 వేలమంది మృతి చెంది నట్లుగా 51 వేల మంది అడ్రస్ లో అందుబాటులో లేక పోవడం 71 వేల మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి పోయి నట్లుగా నమోదు అయింది.
అర్బన్ లో
3.08 లక్షల వోటర్లు వుంటే 27.48 లక్షల మందే ఫామ్ ను దాఖలు చేసారు పట్టణ ప్రాంతాల్లోనే అధికం..
ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించినప్పటి అంచనాల కంటే ఎక్కువగానే ఓట్లు పోయాయని చెబుతున్నారు. ఇతర జిల్లాల్లోనూ పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లోనే ఎక్కువ ఓట్లు తొలగించే అవకాశం ఉందని అంటున్నారు.
పోయిన ఓట్లు అన్ని కూడా పూర్తిగా పట్టణ ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు కావడం, ఇక్కడే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఉండటం విశేషం. దీంతో నగరంలో భారీగా ఓటర్లు తగ్గనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం 90 శాతానికి పైగా నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తగ్గనున్న పోలింగ్ కేంద్రాలు..
ఎన్నికల అధికారులు ఈనెల 17న ఓటరు ముసాయిదా ప్రకటించనున్నారు. ఆ రోజు ఎవరి ఓటు ఉందో.. ఎవరిది లేదో అధికారికంగా బహిర్గతం కానుంది.
ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ఓటర్లు జాబితా కోసం వేచి చూస్తున్నారు. ఎన్యూమరేషన్ఫారాల స్వీకరణ గడువు ముగియడంతో బీఎల్‌వోలు, పర్యవేక్షకులు అందరు కూడా ముసాయిదా ఓటరు జాబితా ప్రకటనపై దృష్టి పెట్టారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండటానికి కసరత్తు చేస్తున్నారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో బీఎల్‌వోలకు సరైన అవగాహన లేక, సరిగ్గా పనిచేయకపోవడంతో అక్కడి ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పూర్తీ స్థాయిలో వోటర్ల జాబితా ఇంకా సిద్ధం కాలేదు ఇప్పుడు అదే కసరత్తులో అధికారులున్నారు
