మెండోరా, ఆగస్టు 10:ముప్కాల్ నుంచి మెండోరా వైపు వస్తున్న ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.
ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముప్కాల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సాయికుమార్ ప్యాసింజర్ ఆటోను అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కోడిచర్ల గ్రామానికి చెందిన వేల్పూరు దేవాయ్ అనే మహిళ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందింది.
ఆటోలో ప్రయాణిస్తున్న మరికొందరికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు.
