HomeCRIMEకోడిపందేలపై పోలీసుల దాడి – 12మంది అరెస్టు :

కోడిపందేలపై పోలీసుల దాడి – 12మంది అరెస్టు :

సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిర్మన్‌పల్లి గ్రామ శివారులో గల ఇటుక బట్టీ ప్రాంగణంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు సదాశివనగర్ పోలీసులు రైడ్ నిర్వహించారు. 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 09 ద్విచక్ర వాహనాలు, 03 కార్లు, 11 మొబైల్ ఫోన్లు, నగదు రూ, 45,050 మరియు 65 కోడిపందేల కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

రైడ్ సమయంలో కొంతమంది వ్యక్తులు పోలీసులను గమనించి అక్కడి నుండి పరారయ్యారు. పరారైన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ప్రజలు చట్టవిరుద్ధమైన కోడిపందేలు, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్సై పుష్పరాజ్ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments