లింగంపేట్ మండల కేంద్రంలోని ఎస్ బీ ఐ ఏటీఎంలో సోమ వారం వేకువ జామున ఒక దుండగుడు చోరికి విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకున్నట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకా రం గాంధారి మండల కేంద్రానికి చెందిన శశి కుమార్ అనే వ్యక్తి లింగం పేట మండలం లింగంపల్లి గ్రామ శివారులో గల వాటర్ ప్లాంట్ లో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నా డు. శశి కుమార్ సోమ వారం వేకువ జామున అందాజ ఒంటిగంట ప్రాంతంలో లింగంపేట మండల కేంద్రంలోని ఎస్ బీఐ ఏటీఎం కేంద్రం వద్దకు ఆటోలో వచ్చాడు.
ఆటోను ఇంటి పక్కన సందులో ఉంచి ఏటీఎంలోకి చొర బడ్డాడు. ఏటీఎం లోని నగదును దోచుకెళ్లేందుకు ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేస్తుండగా వచ్చిన శబ్దంతో ఇంటి యజమాని పంబల్ల రఘునందన్ నిద్రలో నుంచి లేచి పోలీసులకు సమాచారం చేరవేశాడు.
దాంతో ఎస్సై తన సిబ్బందితో ఏటీఎం కేంద్రానికి చేరుకొని చోరీకి పాల్పడిన శశి కుమార్ ను అదుపులోకి తీసుకు న్నారు. సోమవారం ఉదయం ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకొని దొంగత నానికి పాల్పడిన తీరు పై విచారణ చేపట్టారు.
క్లూస్ టీం సభ్యులు వేలిముద్రల నమూనా లను సేకరించారు. హైదరాబాద్ ఎస్బిఐ మేనేజర్ గంగాధర్ మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
